Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుమారుడిని చూశారా? కటౌట్ అద్దిరిపోయిందిగా.. వీడియో ఇదిగో

ప్రస్తుతం టాలీవుడ్ లో ది బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఎస్. ఎస్. తమన్. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ఈ మ్యూజిక్ డైరెక్టరే టాప్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుమారుడిని చూశారా? కటౌట్ అద్దిరిపోయిందిగా.. వీడియో ఇదిగో
Music Director SS Thaman

Updated on: May 18, 2026 | 4:17 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లో ఎస్.ఎస్. తమన్ ఒకరు. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ నిత్యం బిజీ బిజీగా ఉంటున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. 2008లో మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన కిక్ సినిమాతో మొదలైన తమన్ ప్రస్థానం ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. ప్రస్తుతం తెలుగులోనే కాదు దక్షిణాది, హిందీ భాషల్లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు తమన్. స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సైతం తమ సినిమాలకు తమననే టాప్ ప్రియారిటీగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చే పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సినిమాలు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సూపర్ హిట్ గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు కొన్ని థియేటర్స్ లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ తట్టుకోలేక DTS బాక్స్ లు, స్క్రీన్ లు కాలిపోవడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు ఇప్పటికే రెండు విడుదలయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్ యావరేజ్ గా నిలవగా తమన్ బీజీఎమ్ అందించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓ మోస్తరుగా ఆడింది.

ప్రస్తుతం తమన్ చేతిలో అఖిల్ అక్కినేని లెనిన్, వెంకటేష్ ఆదర్శ కుటుంబం, వరుణ్ తేజ్ కొరియన్ కొనకరాజు తదితర క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అలాగే తమిళంలో `ఇదయం మురళి`, `సిగ్మా` వంటి క్రేజీ ప్రాజెక్టులకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే తమన్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా ఆయన భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలియదు. బయట కూడా పెద్దగా కనిపించరు. అయితే తమన్ కుమారుడికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమన్ ప్లే బ్యాక్ సింగర్ శ్రీ వర్దినిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అచ్యుత్ అనే కుమారుడు ఉన్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం అచ్యుత్ పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అచ్యుత్ కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా తమన్ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతను కంపోజ్ చేసిన ప్రతి పాటను మొదట అచ్యుతే వింటాడట.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో తమన్ కుమారుడు.. వీడియో.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us