
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలతో పాటు వాణిజ్యప్రకటనలతో కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు బ్రాండ్ లకు మహేష్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో థమ్సప్(Thums Up) యాడ్‌లో నటించిన మహేష్ ఇప్పుడు మరో కూల్ డ్రింక్ యాడ్ లో నటించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు తాజాగా మరో బ్రాండ్ కి ప్రచార కర్తగా మారారు. అదే `మౌంటేన్ డ్యూ`(Mountain Dew). దీనికి సంబంధించిన కమర్షియల్ యాడ్‌ని ఇటీవలే షూట్ చేసి శుక్రవారం ఫిబ్రవరి 4న విడుదల చేశారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు మహేష్. దుబాయ్ లోని అత్యంత పాపులర్ అయిన బూర్జు ఖలీఫాపై ఈ యాడ్ ని షూట్ చేశారు. దుబాయ్ లోని అత్యంత పాపులర్ అయిన బూర్జు ఖలీఫాపై ఈ యాడ్ ని షూట్ చేశారు.
బుర్జ్ ఖలీఫాపై నుంచి కింది వరకు బైక్‌పై వచ్చినట్లు ఈ యాడ్ ఉంది. హాలీవుడ్ రేంజ్లో దీన్ని రూపొందించారు. భయానికి భయపడితే ఏ సాహసమూ చేయలేమని మహేశ్ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఏ యాడ్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మహేష్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :