Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మంచు మోహన్ బాబు (Mohan Babu). విలన్ పాత్రల నుంచి స్టార్ హీరోగా

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..
Mohan Babu

Updated on: Jan 13, 2022 | 11:31 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మంచు మోహన్ బాబు (Mohan Babu). విలన్ పాత్రల నుంచి స్టార్ హీరోగా ఎదిగి ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ డైలాగ్ కింగ్ సక్సెస్ అయ్యారు. అయితే ఇటు వెండితెరపై రాణిస్తున్న సమయంలోనే కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు మెహన్ బాబు. రెండున్నర దశాబ్దాలుగా 25 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి విద్య అందిస్తున్నారు. తాజాగా తాను నిర్వహిస్తున్న కాలేజీ గురించి శుభవార్త షేర్ చేసుకనున్నారు మోహన్ బాబు. ఆయన నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ కాలేజీకి (Sree Vidyaniketan) యూనివర్సిటీ హోదా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

” చిన్న మొలకలుగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు యూనివర్సిటీ విద్యా విశ్వంలోకి చేరుకున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని ఇప్పటినుంచి మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం.. మీ మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను.. కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్..

వెండితెరపై స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అటు నిర్మాతగా.. ఇటు విద్యావేత్తగా మారిపోయారు మోహన్ బాబు. 1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. అన్ని విద్యా సంస్థలు కలగలిసి ఉండడంతో చాలా రోజులుగా యూనివర్సిటీ హోదా కోసం ప్రయత్నిస్తున్నారు మోహన్ బాబు.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..

Loading...
Unable to load recommendations.
Follow Us