RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..

|

Mar 17, 2022 | 1:17 PM

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్  విషయంపై..
Rrr
Follow us on

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని. మార్చి 7న సినిమా టికెట్స్ రేట్లను ఫిక్స్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో మూవీ బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే సినిమా టికెట్స్ పెంచుకోవచ్చు అని ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. అంటే హీరో, హీరోయిన్… డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా.. కేవలం మూవీ బడ్డెట్ మాత్రమే వందకోట్లు పైన ఉంటే టికెట్ ఎంతవరకు పెంచవచ్చని నిర్ణయిస్తామన్నారు. త్వరలోనే ఫైల్ CM జగన్ వద్దకు వెళ్తుందన్నారు మంత్రి పేర్నినాని. అటు ప్రేక్షకులకు … ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలిపారు..

సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉన్న మొదటి, రెండు, మూడు రోజుల్లోనే వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతాయని.. అటు ప్రజల పై భారం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఉందని.. రూ. 20 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‏తో నిర్మించిన చిన్న సినిమాలు ఆ సమయంలో విడుదల అయితే ఒక షో తప్పకుండా వేయాలన్నారు.

రామ్ చరణ్.. తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రాజమౌళి.. నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్‏ను కలిసి టికెట్స్ రేట్ల గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

Also Read: The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..

Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..

Ashoka Vanamlo Arjuna Kalyanam: “అశోకవనంలో అర్జున కళ్యాణం” రిలీజ్ అయ్యేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..