Megastar Chiranjeevi : చిన్న సినిమాకు అండగా మెగాస్టార్.. సురభి 70 ఎంఎం మూవీకి మెగా విషెస్

అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో రూపొందిన సినిమా సురభి 70 ఎం ఎం.

Megastar Chiranjeevi : చిన్న సినిమాకు అండగా మెగాస్టార్.. సురభి 70 ఎంఎం మూవీకి మెగా విషెస్
Megastar

Updated on: Feb 16, 2022 | 6:36 PM

Megastar Chiranjeevi : అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వంలో రూపొందిన సినిమా సురభి 70 ఎం ఎం. బాబీ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్నఈ యూత్ ఫుల్ ఫామిలీ డ్రామా విడుదలకి సిద్ధం అయ్యింది. నాలుగు పాటలు ఉన్న ఈ సినిమా ఆడియో ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియోస్ విడుదల చేసింది . డెన్నిన్స్ నార్టన్ సంగీతం అందించిన నాలుగు పాటలకి దర్శకుడు గంగాధర వై కె అద్వైత లిరిక్స్ రాసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ” చిట్టి చిట్టి కన్నులో” అనే చిరంజీవి ట్రిబ్యూట్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి వరకు చేరింది. ఆ సాంగ్ చూసి మెగాస్టార్ చిరంజీవి టీమ్ ను ఇంటికి పిలిచి అభినందించారు.

అంతే కాదు.. 18న రిలీజవుతున్న ఈ సినిమా విజయవంతంకావాలని ఆకాక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18 న విడుదల అవ్వబోతున్న సురభి 70 ఎం ఎం సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో వినోద్ , అనిల్ , ఉషాంజలి , మహేష్ వై , అక్షిత ,చంద్రకాంత్ , శ్లోక , యోగి, అనీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కె కె చైతన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ విషెస్ తో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Suriya Sivakumar : సూర్య ‘ఈటి’ మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట

Rashmika Mandanna: ‘నా దృష్టిలో ప్రేమంటే అదే’.. తనను కట్టుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన నేషనల్‌ క్రష్‌..

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్