
Megastar Chiranjeevi: కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. మరి కొందరు హీరోలు హీరోయిన్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తారక్ తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ అన్ని కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కాంటాక్ట్ అయినవాళ్లు వెంటనే టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ సూచించారు.
అయితే తారక్ కు కరోనా అని తెలియగానే సినిమా తారలు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారక్ కు ఫోన్ చేశారు. తారక్ మరియు ఆయన కుటుంబసభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు. క్రితం తారక్ తో తాను ఫోన్ లో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. తారక్ ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తారక్ ఉత్సాహంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆనందంగా అనిపించిందని చెప్పారు. త్వరలోనే తారక్ పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నానని” మెగాస్టార్ ట్వీట్ చేసారు. ఇప్పుడు చిరు ట్వీట్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
మరిన్ని ఇక్కడ చదవండి :