Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Chiranjeevi: చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
Chiranjeevi

Updated on: Jul 23, 2026 | 6:40 AM

క, కే ర్యాంప్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. బేబీ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చాడం విశేషం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న చెన్నైలవ్ స్టోరీ సినిమా ఈ శుక్రవారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ( జులై 23) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చింది. ఇక్కడికి నేను రావడానికి కారణం అభిమానులే. అందరితో నాకు మంచి అనుబంధం ఉంది. అభిమానులు పైకి వస్తే ప్రాణప్రదంగా చూసుకుంటాను. అభిమానులు నన్ను స్పూర్థిగా తీసుకుని ప్రయోజకులు అయితే మాత్రం అది నాకు మీరు చూపించే నిజమైన ప్రేమ. అందరితో పాటు ఆనందాన్ని పంచుకోవాలనే ఇక్కడికి వచ్చాను’.

‘SKN నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పిఆర్ నుంచి జర్నలిస్టుగా మొదలై గీతా ఆర్ట్స్‌తో ట్రావెల్ చేసి ఇప్పుడు సొంతంగా నిర్మాతగా మారారు. తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సాయి రాజేష్ కూడా అదే విధంగా ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్‌తో, రైటింగ్ కేపబిలిటీతో ఎదిగాడు. సక్సెస్ అయ్యాడు. రెండు నేషనల్ అవార్డ్స్ పొందాడు. ఫ్యాన్ బాయ్స్ సక్సెస్ అయినపుడు మీకెలా ఉంటుందో తెలియదు కానీ. మిమ్మల్ని చూసి నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వీళ్లందరూ ఈరోజు కలలు కని సక్సెస్ అయ్యారు. కంఫర్టబుల్ జోన్ వదిలేసి కష్టానికి ఎదురీదాలి. అవకాశాల కోసం చూస్తున్నపుడు కష్టనష్టాలతో పాటు అవమానాలు ఉంటాయి.. ఇప్పుడు నేను చెప్పేది కాదు ఎప్పట్నుంచో ఉంది.. ఉన్నది ఒకటే జీవితం కష్టపడాలి..
రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు ఉన్నపుడు అంతమంది ఉద్దండులు ఉన్నపుడు వచ్చాను.. ఆ నమ్మకంతోనే వచ్చాను.. ఏమిచ్చి ప్రేక్షకులను కూర్చోబెట్టగలను అని నమ్మకంతోనే వచ్చాను’

‘కిరణ్ అబ్బవరం నెక్ట్స్ డోర్ బాయ్‌లా ఉంటాడు.. ఇది ఒక్కరికే సొంతం కాదు.. అందరికీ అవకాశాలిస్తుంది ఇండస్ట్రీ..
రాయచోటిలో పుట్టి ఇక్కడి వరకు వచ్చాడు కిరణ్. పరిశ్రమకు కొత్త బ్లడ్ రావాలి. తెలుగింటి అమ్మాయి శ్రీ గౌరీప్రియ చాలా అద్భుతంగా ఉంది. నీలాంటి తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించాలి. పెద్దిలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాసాడు. ఇందులోనూ సింగిల్ కార్డ్.. చాలా చక్కటి వక్త, రైటర్. ఇండస్ట్రీలో ఇంత దూరం వచ్చానంటే చాలా మంది కారణం. డాన్సులు చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ కీలకం.. మణిశర్మ గురించి ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పే అవకాశం రాలేదు. మణి మై బ్రదర్ లవ్ యూ సో మచ్. మైత్రి నుంచి రవి, నవీన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకు’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి స్పీచ్.. ఫుల్ వీడియో ఇదిగో..

Follow Us