
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో రాబోతున్న గాడ్ ఫాదర్ (God Father). మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్‌తో సినిమాపై హైప్ పెరిగింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భాయ్ గాడ్ ఫాదర్ షూటింగ్లో జాయిన్ అయిపోయారు కూడా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సల్మాన్‌తో కలిసి తాను డ్యాన్స్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్, చిరుతో ఓ డాన్స్ షూట్ జరుగుతుంది. వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను షేర్ చేసుకున్నారు చిరు. “భాయ్‌తో కలిసి కాలు కదిపాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట కన్నుల పండుగలా ఉంటుంది” అంటూ రాసుకొచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కాకుండా చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Megastar
ట్వీట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.