గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సినీ తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా హీరోహీరోయిన్ల బాల్య జ్ఞాపకాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికుల రేర్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ముగ్గురు చిన్నారు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకులు. ఇద్దరు హీరోలుగా కొనసాగుతుండగా.. మరొకరు సహాయ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి ముగ్గురికి తెలుగురాష్ట్రాల్లోనే అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.
ఆ ముగ్గురు చిన్నారులు మరెవరో కాదు.. మెగా ఫ్యామిలీ అగ్రకథానాయకులు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే అనేక మందికి స్పూర్తిగా నిలిచారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కళ్యాణ్ బాబు చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు.
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి