సంక్రాంతి రేసులో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. గతంలో విడుదలైన టీజర్ చూస్తుంటే.. మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళంతోపాటు.. దాదాపు 12 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలో కొద్దిరోజులుగా హనుమాన్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకను పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్. జనవరి 7న ఈ సినిమా మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ పేరితో ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు టాక్ నడిచింది. అంతేకాదు..ఇందులో హనుమాన్ పాత్రలో చిరు కనిపించనున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. కానీ హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ పంచుకున్నారు చిత్రయూనిట్ సభ్యులు.
Here’s the Majestic Mega Update you all have been waiting for 🤩
Megastar @KChiruTweets garu will grace the ‘Celebrating #HANUMAN Mega Pre-Release Utsav’ with his immortal presence ❤️🔥
🗓️ JAN 7, Sunday
📍 N Convention, HYDA @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW… pic.twitter.com/PAsKSXHjQT
— Primeshow Entertainment (@Primeshowtweets) January 4, 2024
తాజాగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. సైరా నరసింహా రెడ్డి చిత్రంలోని చిరు లుక్తో హనుమాన్ సినిమాలో తేజ సజ్జా లుక్ జత చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హనుమాన్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Hanuman poster ft @tarak9999 @PrasanthVarma #AllHailTheTiger pic.twitter.com/aaOci2jXQ6
— prasanth (@Prasanth9899) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.