సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక నాయర్ వివాహ వేడుక అంగరంగ వైభవంగ జరిగింది. నవంబర్ 19న ఆదివారం ఉదయం రోహిత్ మేనన్తో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో.. కేరళ సంప్రదాయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడకలో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్స్ రాధిక , సుహాసిని, రేవతి, మేనక పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కార్తీక. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జీవా నటించిన రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక.. వ్యాపారరంగంలో రాణిస్తుంది.
Annayya #Chiranjeevi garu attended @ActressRadha‘ s Daughter @KarthikaNair9 and Rohit wedding in Trivandrum
Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/3ZOATcHuRa
— శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్ (@PathinaSrinu) November 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.