మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్పీడ్ మీదున్నాడు. ఒకేనెలలో నాలుగు సినిమా షూటింగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. వరుస్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను కంప్లీట్ చేశాడు చిరు. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా కాకుండా.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నాడు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక తాజాగా చిరు.. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారని టాక్.
ఇదిలా ఉంటే.. చిరు.. బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు నటించిన పోకిరి తరహాలో ఉండనుందట. మొదటగా అంతా మాస్ హీరోగా కనిపించి చివరకు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట చిరు. అలాగే ఈ సినిమా ప్రధానంగా శ్రీలంక అని.. అక్కడ జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి చిరు కూలీగా ఎంట్రీ ఇచ్చి.. వారిలో ఒకడిగా మారి చివర్లో పోలీస్ గా మారి విలన్ల ఆట కట్టించడమే సినిమా అనట్టుగా టాక్. ఇందులో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయట. ఇక చిరును పూర్తిగా ఊరమాస్ లుక్ లో చూపిస్తూ.. అందుకు తగ్గ యాసతో చిరు అభిమానులను మెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్.
Anchor Ravi: షణ్ముఖ్‌తో ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్ అనేశాడు.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్..