Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన చిరంజీవి.. మెగా డిసెంబర్ అంటూ నెట్టింట్లో చిరు మేనియా..

మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డ్ సృష్టించారు. ఇప్పటివరకు ఏ స్టా్ర్ అందుకొని ఫిట్ చిరు సొంతం చేసుకున్నారు. ఏకంగా

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన చిరంజీవి.. మెగా డిసెంబర్ అంటూ నెట్టింట్లో చిరు మేనియా..
Chiranjeevi

Updated on: Dec 07, 2021 | 9:05 AM

మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డ్ సృష్టించారు. ఇప్పటివరకు ఏ స్టా్ర్ అందుకొని ఫిట్ చిరు సొంతం చేసుకున్నారు. ఏకంగా నాలుగు సినిమాల్లో ఏకకాలంలో నటించనున్నారు. ఒకే నెలలో నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లడం ద్వారా సినీ పరిశ్రమలోనే అరుదైన ఘనత అందుకున్నారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేసిన చిరు.. ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు.

అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాన్ని చేయనున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాలన్ని డిసెంబర్ నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.  తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా వేదాళంను తెలుగు రీమేక్ భోళా శంకర్‏గా తెరకెక్కిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఇక మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార కీలక పాత్రలో నటిస్తుంది.  ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆచార్య సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also Read:  Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..

Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..

Loading...
Unable to load recommendations.
Follow Us