Varun Tej Ghani: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. ఆకట్టుకుంటున్న గని టీజర్

Varun Tej Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన రూటు సెపరేట్ అని చెప్పకనే చెప్పాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్..

Varun Tej Ghani: ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. ఆకట్టుకుంటున్న గని టీజర్
Varun Tej Ghani

Updated on: Nov 15, 2021 | 11:18 AM

Varun Tej Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన రూటు సెపరేట్ అని చెప్పకనే చెప్పాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 వంటి డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు గని టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి ..కన్నీళ్లు ఉంటాయి..  కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై..యూ… ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అని చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని సినిమా కోసం వరుణ్ తేజ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. క్రీడాకారుడిగా కనిపించడానికి ప్రేక్షకులను అలరించడానికి తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ ని చూసి అభిమానులు ఫిదా. వరుణ్ మేకోవర్ చూసి అభిమానులే కాదు.. సినీ ఇండస్ట్రీ కూడా వారేవా అంటుంది. అసలే ఆరడగులకు పైగా పొడవు.. ఇప్పుడు ఫిట్ తో సిక్స్ ప్యాక్ బాడీ.. దీంతో వరుణ్ తాజా లుక్ హాలీవుడ్ హీరోని తలపిస్తుంది. గ్రీకు శిల్పం లాంటి బాడీని చూసినా అభిమానులు ఫిదా.. వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తుంది. ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టితో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు  కూడా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ నిర్మిస్తున్నాడు.

 

Also Read:  పెను సంక్షోభం దిశగా అమెరికా.. 44 లక్షల మందికి పైగా ఉద్యోగులు రాజీనామా..

ఫైల్స్ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఉల్లికాడలను ఇలా తీసుకుంటే..శాశ్వత పరిష్కారం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us