మెగాపవర్ స్టార్‌‌‌కు జోడీగా లక్కీ బ్యూటీ పేరు వినిపిస్తుందే.. శంకర్ సినిమాలో హీరోయిన్ ఆమేనా..

|

Jul 20, 2021 | 5:14 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.

మెగాపవర్ స్టార్‌‌‌కు జోడీగా లక్కీ బ్యూటీ పేరు వినిపిస్తుందే.. శంకర్ సినిమాలో హీరోయిన్ ఆమేనా..
Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలతోపాటు టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే శంకర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు చరణ్.

డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన దగ్గరనుంచి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ సినిమాను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అనూహ్యంగా భారతీయుడు 2 సినిమా వివాదంలో చిక్కుకుంది. లైకా వారి వివాదం కొనసాగుతూ ఉండగానే రామ్ చరణ్ సినిమా పనులు కూడా మొదలుపెట్టేశాడు శంకర్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక మందన పేరు వినిపిస్తుంది. చరణ్ -శంకర్ సినిమాలో రష్మిక దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఖరారు అయ్యారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రాజకీయాల నేపథ్యంతో తెరకెక్కనుండగా.. రామ్ చరణ్  స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

 

 

మరిన్ని ఇక్కడ చదవండి : 

నీ అభిమానం చల్లగుండా.. సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం..

Kushboo : ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. తమిళనాడు డీజీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు..

Charmy Kaur: తండ్రిని కాకాపట్టడానికి ట్రైచేసిన హీరోయిన్ ఛార్మి.. చివరకు ఏమైందో తెలుసా..