సాధారణంగా మన తెలుగు సినీ స్టార్స్‌కు వెహికల్స్ అంటే ఎంత ఇష్టపడుతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్స్, స్పోర్ట్స్ బైక్స్, లగ్జరీ కార్స్ అంటే మోజు కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక స్టార్ హీరోల గ్యారేజీలలో రకారకాల కార్లు, బైక్స్ ఉంటాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోస్ దగ్గర వివిధ రకాల బైక్స్, కార్లు గ్యారెజీలో ఉంటాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న లంబోర్ఘిని కారు ఎ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రభాస్ సైతం ఇదే కారును కొనుగోలు చేసి ముంభై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైత ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. విషయమేంటంటే.. ఆ కారును చరణ్ దగ్గరుండి మరి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ డిజైన్డ్ బెంజ్ కారును నిన్న ఆదివారం రామ్ చరణ్‌కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ న్యూ బెంజ్ కారు లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కారును చూస్తుంటే..మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని టాక్.. ఇక తను ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న బెంజ్ కారును రామ్ చరణ్ కొద్ది సేపు డ్రైవ్ చేశారు. చెర్రీ న్యూ బెంజ్ కార్ పై మీరు ఓ లుక్కెయ్యండి.
Megapower Star @AlwaysRamCharan receives his new Mercedes Maybach GLS 600 #RamCharan pic.twitter.com/AV6kK3K2UB
— BA Raju’s Team (@baraju_SuperHit) September 12, 2021
Also Read: Uttej Wife Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత..
Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోట సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..