Manchu Manoj: అత్యవసరమై 5 లక్షల కోసం అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. చెప్పేది కూడా పూర్తిగా వినకుండానే..

మంచు మనోజ్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గానూ మెప్పిస్తున్నాడీ మంచు వారబ్బాయి. ప్రస్తుతం ఈ రాక్ స్టార్ చేతిలో దాదా వంటి పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఆ మధ్యన ఓ సందర్భంలో తన తోటి హీరో గురించి మనోజ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Manchu Manoj: అత్యవసరమై 5 లక్షల కోసం అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా..  చెప్పేది కూడా పూర్తిగా వినకుండానే..
Manchu Manoj

Updated on: Nov 20, 2026 | 9:41 PM

మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన తనదైన యాక్టింగ్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ రాక్ స్టారు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ట్యాలెంటెడ్ నటుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో కొన్నేళ్లు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా బాగా స్ట్రగుల్ అయ్యాడు మనోజ్. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడం దీనికి తోడు భార్యతో విడాకులు.. ఇలా చాలా విషయాలు మనోజ్ ను వెనక్కులాగాయి. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ స్ట్రాంగ్ గా తిరగొచ్చాడీ మంచు వారబ్బాయి. నిజం చెప్పాలంటే మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మనోజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో తేజ సజ్జా మిరాయ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు మనోజ్. ఇందులో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘దాదా’ సినిమాలోనూ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు మనోజ్. దీనితో పాటు ఈ మంచు వారబ్బాయి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మంచు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో కలివిడిగా ఉంటారు మంచు, మెగా ఫ్యామిలీ హీరోలు. ముఖ్యంగా మంచు మనోజ్ కు మెగా హీరోలతో మంచి అనుబంధం ఉంది. ఆ మధ్యన మంచు మనోజ్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ గురించి ఓ సందర్భంలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

‘కొన్నేళ్ల క్రితం నేను ఓ కోర్స్ నేర్చుకునేందుకు అమెరికాకు వెళ్లాను. ఆ సమయంలో దుబాయ్‌లో ఉంటున్న ఓ ఫ్యామిలీకి వీసా కష్టాలు వచ్చాయి. ఇండియాకు తిరిగి రావడానికి డబ్బులు లేవు. ఓ ఐదు లక్షలు కావాలని నాకు ఫోన్ వచ్చింది. ఆ సమయానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. బ్యాంక్ ఖాతా కూడా నిల్ అయిపోయింది. కానీ వాళ్లకు ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నాను. వెంటనే రామ్ చరణ్ కు ఫోన్ చేశాను. అప్పుడు రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ ఓ సినిమా ప్రీమియర్ షోలో ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేసిన రామ్ చరణ్ మెల్లిగా మాట్లాడుతూ.. ‘ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావ్’ అని అడిగాడు. ఇలా అవసరం ఉంది.. కొంచెం డబ్బులు కావాలి అని పూర్తిగా విషయం చెప్పే లోపు.. ఎంత కావాలి.. వెంటనే అకౌంట్ నంబర్ పంపు’ అని అన్నాడు. అలా చెప్పాడో లేదో కేవలం నిమిషంలో చరణ్ నుంచి డబ్బులు వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ మంచు వారబ్బాయి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

 

Manchu Manoj, Ram Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us