Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..

సైదాబాద్ నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరిగింది. పట్టుకుంటే ఎక్కడ చిత్రహింసలు పెట్టి చంపుతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రేపిస్ట్.

Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..
Manoj

Updated on: Sep 16, 2021 | 12:32 PM

Manchu Manoj : సైదాబాద్ నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరిగింది. పట్టుకుంటే ఎక్కడ చిత్రహింసలు పెట్టి చంపుతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రేపిస్ట్. సైదాబాద్ సింగరేణి కాలనీ  చిన్నారి చైత్ర పై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన రాజు కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మ శాంతించింది. చైత్రపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చిన రాక్షసుడు సరిగ్గా వారం రోజులకే  ప్రాణాలు విడిచాడు. యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ధ్రువీకరించారు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికిి ఇలా శవమై కనిపించాడు. గత కోదిరోజులుగా పరారీలో ఉన్న నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

చివరకు స్టేషన్ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌పై డెడ్‌బాడీ పడి ఉందనే సమాచారంతో స్పాట్‌కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న టాటూను చూసి ఆతనేనని కన్‌ఫామ్‌ చేసుకున్నారు. దాంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.. దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు మనోజ్. ఇటీవలే మనోజ్ చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం

Saidabad Incident: సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య.. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్‌పై..

Saidabad Incident: మేమున్నాం మీకు.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us