Manchu Family: చిరు వ్యాఖ్యల అనంతరం మంచు ఫ్యామిలీ నుంచి సెన్సేషనల్ న్యూస్!

ఇండస్ట్రీకి పెద్దగా ఉండనంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చిన కాసేపటికే మంచు ఫ్యామిలీ నుంచి మరో సెన్సేషన్ న్యూస్ వినిపిస్తోంది.

Manchu Family: చిరు వ్యాఖ్యల అనంతరం మంచు ఫ్యామిలీ నుంచి సెన్సేషనల్ న్యూస్!
Mohan Babu

Updated on: Jan 02, 2022 | 1:46 PM

ఇండస్ట్రీకి పెద్దగా ఉండనంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చిన కాసేపటికే మంచు ఫ్యామిలీ నుంచి మరో సెన్సేషన్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యపై నేనున్నానంటూ మంచు మోహన్‌ బాబు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అవును, టికెట్ల ధర తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని మోహన్ బాబు ఓ లేఖ రాయబోతున్నారు. ఇండస్ట్రీల సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన పెద్దరికం తీసుకోబోతున్న సంకేతాలు ఆ లేఖ ద్వారా కనిపించబోతున్నట్లే ఉంది. లేఖ రాయడమే కాదు.. ఆ లేఖ తర్వాత ఏపీ ప్రభుత్వంతో మోహన్‌బాబు చర్చలూ జరిపే చాన్స్ కనిపిస్తోంది.

మరోవైపు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచిన సీఎం కేసీఆర్‌కూ మోహన్‌బాబు కృతజ్ఞతలు చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే.. చిరు ప్రకటన చేసిన కాసేపటికే మోహన్‌బాబు ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే.. ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌ తెరపైకి రాబోతున్నట్లు కనిపిస్తోంది.

Also Read: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు

Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..

Follow Us