వామ్మో ! ఇదేం పిచ్చిరా సామీ.. ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూశాడు.. కట్ చేస్తే.!

| Edited By: Rajeev Rayala

Nov 08, 2023 | 6:39 PM

సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం 1 లేదా 2 సినిమాలు చూస్తారు... కానీ ఓ వ్యక్తి కి మాత్రం సినిమాలు అంటే పిచ్చి. కాదు కాదు అంత కన్నా ఎక్కువే.. కనీసం రోజుకు మూడు సినిమాలు చూసి ఏడాదికి 777 సినిమాలు చూసిన వ్యక్తి గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాడు. సినిమాలు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి.. కాస్త సమయం దొరికితే కొత్త సినిమాలు ఏమి వచ్చాయా.. అని చూసి, ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నారు.. కానీ..

వామ్మో ! ఇదేం పిచ్చిరా సామీ.. ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూశాడు.. కట్ చేస్తే.!
Zachariah Swope
Follow us on

కాస్త విరామం దొరికింది అంటే వినోదం కోసం సినిమాలు చూస్తాము..కనీసం ఒక్క రోజు లో ఎన్ని సినిమాలు చూడొచ్చు అంటే ఒక్క సినిమా మాత్రమే అని ఈజీగా చెప్పొచ్చు.. ఇక కొంతమంది అయితే థియేటర్ మొహం కూడా చూడని వారు కూడా ఉంటారు.. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం 1 లేదా 2 సినిమాలు చూస్తారు… కానీ ఓ వ్యక్తి కి మాత్రం సినిమాలు అంటే పిచ్చి. కాదు కాదు అంత కన్నా ఎక్కువే.. కనీసం రోజుకు మూడు సినిమాలు చూసి ఏడాదికి 777 సినిమాలు చూసిన వ్యక్తి గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాడు. సినిమాలు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి.. కాస్త సమయం దొరికితే కొత్త సినిమాలు ఏమి వచ్చాయా.. అని చూసి, ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నారు.. కానీ అమెరికా కు చెందిన ఓ వ్యక్తి కి మాత్రం సినిమాలు అంటే అమితమైన ప్రేమ… ఏకంగా 777 సినిమాలు చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాడు.

అమెరికాకు చెందిన 32 ఏళ్ల జాక్ సినిమాలు అంటే ఎంత ఇష్టం. దీంతో ఆ సినిమాలు తోనే వరల్డ్ రికార్డర్ సృష్టించాలని భావించాడు జాక్.. అందుకే ఓవైపు తన ఉద్యోగం చేస్తూనే మరోవైపు థియేటర్లో సినిమాలు చూడడం మొదలుపెట్టాడు.. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఉద్యోగానికి వెళ్లేవాడు జాక్.. ఆ తర్వాత కుదిరిన రోజుల్లో రోజుకు కనీసం మూడు సినిమాలను తగ్గకుండా చూసేవాడు.. ఇక సెలవు రోజుల్లో వాటిని రెట్టింపు చేసేవాడు.. ఇలా మే 2022 నుంచి మొదలుపెట్టిన జాక్.. మే 2023 పూర్తి సరికి ఏకంగా 777 సినిమాలు చూశాడు.. మొదటగా మిలియన్స్ రైజ్ ఆఫ్ గ్రూ అనే సినిమాతో ప్రారంభించి.. ఇండియాన్ జోన్స్ అండ్ డెస్టినీతో సినిమాను పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ ఓల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు జాక్.. అయితే ఈ రికార్డు ను క్రియేట్ చేయడం కోసం జాక్ కొన్ని నియమాలు కూడా పాటించాడు.. ఆవేమిటి అంటే సినిమాలు చూసే సమయంలో మరొక పని చేయకూడదు..అంటే ఫోన్ చూడడం,నిద్రపోవడం లాంటి పనులు చేయకూడదు.. అలాగే తినడం, తాగడం లాంటివి చేయకూడదు.. ఈ నిబంధనలన్నీ పాటించాడని.. నిర్ధారణ చేసుకున్న తర్వాతే గిన్నిస్ యాజమాన్యం జాక్ పేరును రికార్డులో నమోదు చేసింది.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం జాక్ ఆటిజంపై అవగాహన పెంచడం కోసం ఈ పని చేశాడు. ఆటిజం కారణంగా జాక్ గతంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ అది సరికాదని తెలుసుకున్న జాక్.. దాని నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డు సాధించాలనుకున్నాడు అందుకే ఇలా చేశాడు జాక్. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి తన రికార్డును తానే తిరగరాయాలని భావిస్తున్నాడు. ఇక ఈ రికార్డును సాధించినందుకు గాను అమెరికాలోని ఆత్మహత్య నివారణ సంస్థ జాకు 7,77,777 డాలర్ల ను అంటే 6లక్షల రూపాయలు బహుమతి గా ఇచ్చింది.. గతంలో ఈ రికార్డు ఫ్రాన్స్కు చెందిన విన్సెంట్ క్రోన్ పేరు మీద ఉండేది. అతడు 715 సినిమాలు చూసి ఈ రికార్డును సృష్టించాడు ఇప్పుడు జాక్ 777 దాన్ని తిరగరాసాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.