Major Movie: అంచనాలు పెంచుతున్న అడివి శేష్ సినిమా.. భారీ ధరకు మేజర్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్..

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడవి శేష్.

Major Movie: అంచనాలు పెంచుతున్న అడివి శేష్ సినిమా..  భారీ ధరకు మేజర్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్..
Major

Updated on: Jul 02, 2021 | 5:03 PM

Major Movie: విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడివి శేష్. ఇప్పుడు మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు – హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదని తెలుస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మేజర్ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ‘మేజర్’ ఓవర్ సీస్ రైట్స్ మంచి ధరలకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో హిందీ శాటిలైట్ రైట్స్  కూడా రికార్డ్ స్థాయి ధర పలికాయని తెలుస్తుంది. మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ”మేజర్” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అడివి శేష్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Annaatthe: దీపావళికే సూపర్ స్టార్ సినిమా.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Kangana Ranaut’s Thalaivi : ఆకట్టుకుంటున్న కంగనా ‘తలైవి’మూవీ స్టైల్.. నెట్టింట వైరల్

సెకండ్ ఇన్నింగ్స్ లో కలర్స్ స్వాతి దుకుడు..కార్తికేయ సినిమాకు సీక్వెల్ నిఖిల్ తో మరోసారి చలాకీ పిల్ల:Colors Swathi Reentry video.

Follow Us