
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ ఫోటోలలో మహేష్ బాబు సతీమణి నమ్రతతోపాటు మహేష్ అక్కలు, అలాగే ఆయన అన్న రమేష్ బాబు కూతురు భారతి సైతం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోటోలలో భారతి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మహేష్ సోదరి పద్మావతి -బావ గల్లా జయదేవ్ కు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దబ్బాయి అశోక్ ఇప్పటికే తెలుగులో హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం అతడు విసా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఇక చిన్న కోడుకు సిద్ధార్థ్ ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాంటిది.. ప్రస్తుతం కొరియన్ కు చెందిన హాయిన్ / జిన్నీ అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాల సమక్షంలో ఆదివారం ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకలలో మహేష్ బాబు ఫ్యామిలీ, బందువులు అంతా ఎంగేజ్మెంట్ వేడుకలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. భారీ బడ్జెట్ మధ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..