Unstoppable with NBK: బాలయ్య షోకు గెస్ట్ గా ఆ స్టార్ హీరో రానున్నాడా.. నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే..

|

Dec 02, 2021 | 1:53 PM

నందమూరి బాలకృష్ణ ఇటు హీరోగా అటు ఓటీటీ టాక్ షోకు హోస్ట్ గా అలరిస్తున్నారు. బాలయ్య నటించిన అఖండ సినిమా గురువారం

Unstoppable with NBK: బాలయ్య షోకు గెస్ట్ గా ఆ స్టార్ హీరో రానున్నాడా.. నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే..
Nbk
Follow us on

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ ఇటు హీరోగా అటు ఓటీటీ టాక్ షోకు హోస్ట్ గా అలరిస్తున్నారు. బాలయ్య నటించిన అఖండ సినిమా గురువారం (నేడు ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే బాలయ్య తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ అనే టైటిల్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో విజయవంతంగా సాగుతుంది. ఇప్పటికే డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నేచురల్ స్టార్ నాని హాజరయ్యి సందడి చేశారు. ముఖ్యంగా బాలయ్య , మోహన్ బాబు ముచ్చట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడో ఎపిసోడ్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం హాజరు కానున్నారు. ఇందుకు సంబందించిన ప్రోమోను కూడా విడుదల చేశారు ఆహా.

బ్రహ్మానందం తోపాటుగా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్ కు హాజరు కానున్నారు. ఈ ప్రోమోలో బాలయ్య బ్రహ్మానందం తో కలిసి సందడి చేయడం చూపించారు. అలాగే అనీల్ రావిపూడి కూడా బ్రహ్మీతో కలిసి నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే బాలయ్య టాక్ షోకు త్వరలో ఓ స్టార్ హీరో రానున్నడని ప్రచారం జరుగుతుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు బాలయ్య సినిమాకు రాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మహేష్ హాజరయ్యాడు. దాంతో ఇప్పుడు బాలయ్య టాక్ షో కు కూడా మహేష్ రానున్నండని టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..

Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..