Naga Chaitanya: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని యంగ్ హీరో.. నెక్స్ట్ ఆదర్శకుడితోనే

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కథల విషయంలో చైతు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు.

Naga Chaitanya: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని యంగ్ హీరో.. నెక్స్ట్ ఆదర్శకుడితోనే
Naga Chaitanya

Updated on: Mar 24, 2022 | 8:22 AM

Naga Chaitanya: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కథల విషయంలో చైతు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. ప్రేమమ్(Premam) సినిమానుంచి చైతూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతన్య.ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. తెలంగాణ యాసలో మొదటి సారి మాట్లాడి ఆకట్టుకున్నాడు నాగచైతన్య. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే  ఈ ఏడాది కింగ్ నాగార్జున తో కలిసి బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికానుకగా విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీకి థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా చైతన్య కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత పరశురామ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు చైతూ. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇటీవల శింబు నటించిన ‘మానాడు’ సినిమా తెరకెక్కించిన వెంకట్ ప్రభుతో సినిమా చేయబోతున్నాడట చైతన్య. బ్లాక్ బస్టర్ ‘మానాడు’ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. రెండు భాషల్లో హీరోలు వేరైనా విలన్ మాత్రం ఎస్ జె సూర్య అని వెంకట్ తెలిపారు. అంతేకాదు తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో ‘మానాడు’ రీమేక్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. తెలుగులో హీరోగా నాగచైతన్య ను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈవార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us