మా ఎన్నికల రచ్చ ముగిసింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. ఎన్నో సంవత్సరాలుగా మాకు మేము.. మేమంతా సినీ బిడ్డలం అని చెప్పుకుంటూ వచ్చిన.. నటీనటులు.. ఈసారి మా ఎన్నికల ముందు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లారు… తగ్గేదే లే అన్నట్టుగా బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగింది.. ఎప్పుడూ లేనంతగా ఈసారి మా ఎలక్షన్స్ రాజకీయ ఎన్నికలను తలపించాయి. గతంలో ఎలక్షన్స్ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా సర్దుకుపోయిన సభ్యులు.. ఈసారి సినిమా పరిశ్రమ రెండుగా చిలీపోతుందా అనే సందేహాలను కలిగించేలా విమర్శలు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉత్కంఠతతో సాగిన ఎన్నికల్లో చివరకు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. దీంతో ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ల నేను ఉండలేనంటూ ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఆ తదుపరి రోజే.. ఆయన ప్యానల్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసి మా నుంచి తప్పుకున్నారు..
ఇక ఈరోజు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ వేడుకలకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బాలకృష్ణ తదితరులు పాల్గోనగా.. తను మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలు.. ప్రస్తుత పరిస్థితులపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించారు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయనను ఆలయ అధికారులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు.. అనంతరం.. స్వామి, అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించి, ప్రత్యేక పూజలు జరిపారు రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా.. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నేను ‘మా’ కి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత డిగ్నీఫైడ్గా ఉందొ అలా రావాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పాను. ఏదీ శాశ్వతం కాదు… ఇక్కడ ఈవో గారితో మాట్లాడాను.. పెద్ద తిరుపతిలాగా.. చిన్న తిరుపతి కూడా కావాలని అడిగాను.. గెలిచినవారు తప్పకుండా మంచే చేస్తారు. మంచి మంచి ఎజెండా చెప్పాము. మంచి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు రాజేంద్రప్రసాద్.
Also Read: Priyanka Mohan: అందాల రాశి ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ..
Ananya Nagalla: తన అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న వకీల్ సాబ్ భామ అనన్య నాగల్ల