Liger Movie : లాస్‌ వేగాస్‌ టు లాస్‌ ఏంజెల్స్‌.. ల్యాండైన లైగర్‌ టీం..

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్‌’. స్టార్‌ డైరెక్టర్ పూరిజగన్నాథ్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

Liger Movie : లాస్‌ వేగాస్‌ టు లాస్‌ ఏంజెల్స్‌.. ల్యాండైన లైగర్‌ టీం..

Updated on: Nov 28, 2021 | 5:16 PM

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్‌’. స్టార్‌ డైరెక్టర్ పూరిజగన్నాథ్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూరి, ఛార్మీకౌర్‌, కరణ్‌ జోహర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. కాగా ఇటీవల లాస్‌వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న చిత్రబృందం ఇప్పుడు లాస్‌ ఏంజెల్స్‌లో అడుగుపెట్టింది. కొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ జరగనుంది. కాగా లాస్‌ ఏంజెల్స్‌ షెడ్యూల్‌కి సంబంధించిన ఫోటోలను ఛార్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘లైగర్‌’ టీం..లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హాయ్‌ చెబుతుంది’ అంటూ ఫొటోను షేర్‌ చేసింది. .

కాగా ఇదే ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ ‘ హలో ఫ్రం లాస్‌ ఏంజెల్స్‌ ‘ అంటూ లాఫింగ్‌ ఎమోజీని పోస్ట్‌ చేశాడు.
కాగా ఇటీవల ముగిసిన లాస్‌ వేగాస్‌లో విజయ్- మైక్ టైసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక షూటింగ్ సమయంలో విజయ్, అనన్య, ఛార్మి తమ సోషల్ మీడియాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇక విజయ్‌, పూరీలు కలిసి లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ను భాగానే ఎంజాయ్‌ చేసినట్లు వారి సోషల్‌ మీడియా ఫొటోలే చెబుతున్నాయి. అక్కడి రెస్టారెంట్లతో పాటు కొన్ని అందమైన లొకేషన్స్‌లో వీరు ఫోటోలు దిగారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Gopichand Malineni: బాలయ్య సినిమా టిక్కెట్ల కోసం ఈ డైరెక్టర్ రెండు రోజులు జైల్లో ఉన్నాడట..

Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌