ఓ వైపు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు పదుల సంఖ్యలో సీరియల్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. సినిమాలతో సమానంగా సీరియల్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సీరియల్స్ లో నటించిన ప్రతి నటికి హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్, పాపులారిటీతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. సీరియల్స్ లో డిఫరెంట్ పాత్రలు చేసే నటీమణులు బయట మాత్రం తమ అందాలతో మతిపోగొడుతున్నారు. ఇక సీరియల్స్ లో ఎక్కువగా లేడీ విలన్స్ కనిపిస్తూ ఉంటారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న లేడీ విలన్ కూడా ప్రేక్షకులకు బాగానే దగ్గరయింది.
పై ఫొటోలో కనిపిస్తున్న లేడీ విలన్ పేరు ప్రీతి శ్రీనివాస్. తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయ్యింది ఈ నటీమణి. తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ భామ. సీరియల్స్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించే ఆమె బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది.
ప్రీతి శ్రీనివాస్ సీరియల్స్ చీరకట్టులో కనిపిస్తుంది. అలాగే విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టే పాత్ర చేస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మడు బయట మాత్రం కుర్రహీరోయిన్స్ ను బీట్ చేసే అందాలతో ఆకట్టుకుంటుంది. తన వయ్యారాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రీతి శ్రీనివాస్.. తన గ్లామరస్ ఫొటోలతో సెగలు పెట్టిస్తుంది. నెట్టింట రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి