Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు ఈ మాద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. వివాదం ఎక్కడుంటే వర్మ అక్కడుంటారు అన్నట్టుగా మారిపోయారు ఆయన.

Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..
Ram Gopal Varma

Updated on: Jan 24, 2022 | 6:45 PM

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు ఈ మాద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. వివాదం ఎక్కడుంటే వర్మ అక్కడుంటారు అన్నట్టుగా మారిపోయారు ఆయన. నిత్యం వార్తల్లో నిలవడం రామ్‌గోపాల్‌ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేయడం వర్మకు మాత్రమే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలను అత్యంత వేగంగా తీయడంలో కూడా వర్మకు ఎవరూ సాటిరారు. సినిమా ప్రకటించిన ఆరు నెలల్లోపే థియేటర్లకు తెస్తుంటాడు. ఇక ఒకప్పుడు హర్రర్‌ మూవీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న వర్మ ఆ తర్వాత మాత్రం క్రమంగా హర్రర్‌ మూవీస్‌ని తగ్గించి యాక్షన్‌, రొమాంటిక్‌ మూవీస్‌పై పడ్డారు. అలాగే బయోపిక్ సినిమాలు తీయడంలోనూ వర్మ దిట్టే. ఈ క్రమంలోనే  కొండా అనే సినిమాను అనౌన్స్ చేశాడు ఆర్జీవీ. కొండా మురళి జీవిత కథతో ఈ సినిమా రానుంది.  ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఓవీడియోను రిలీజ్ చేశాడు వర్మ. ఈ వీడియోలో ఆర్జీవీ వాయిస్ ఓవర్ ఉంది . “కని విని ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో.. సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారతారు. అలా ఓ అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి అంటూ మొదలు పెట్టారు ఆర్జీవీ. కొండా లాంటి అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు.. ఆశక్తులను చూసి ఓర్వలేక చుట్టూ ఉన్న రూపంలో ఉన్న కొందరు జంతువులు కొందరు చేసిన క్షుద్ర కుట్రలను తిప్పికొడుతూ.. తెలంగాణలో చేసిన ఓ కురుక్షేత్ర యుద్దమే..మా కొండా చిత్రం” అంటూ చెప్పుకొచ్చారు  వర్మ. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు వర్మ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us