Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవిని కలిసిన తెలుగు క్రికెటర్‌.. టీమిండియా జెర్సీ అందించి విషెస్ చెప్పిన భరత్

|

Jan 29, 2024 | 5:01 PM

దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు విషెస్‌ చెబుతున్నారు. చిరంజీవి ఇంటికెళ్లి మరీ ఆయనను అభినందిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్‌, తెలుగు తేజం కేఎస్‌ భరత్‌ చిరంజీవిని కలిశారు

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవిని  కలిసిన తెలుగు క్రికెటర్‌.. టీమిండియా జెర్సీ అందించి విషెస్ చెప్పిన భరత్
Chiranjeevi, Ks Bharat
Follow us on

దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు విషెస్‌ చెబుతున్నారు. చిరంజీవి ఇంటికెళ్లి మరీ ఆయనను అభినందిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్‌, తెలుగు తేజం కేఎస్‌ భరత్‌ చిరంజీవిని కలిశారు. సోమవారం (జనవరి 29) మెగాస్టార్‌ ఇంటికెళ్లిన భరత్‌ తన టెస్ట్‌ జెర్సీని అందించి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక బుధవారం చిరంజీవిని కలిసిన వారిలో వరుణ్‌ తేజ్ ఫ్యామిలీ కూడా ఉంది. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, వరుణ్‌ తల్లి తదితరులు చిరంజీవిని కలిసి అభినందనలు తెలిపారు. అలాగే యంగ్ హీరోస్‌ సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్‌ అబ్బవరం, ‘మొగలిరేకులు’ ఫేమ్‌ ఆర్కే నాయుడు (సాగర్) చిరంజీవిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు.

అంతకుముందు ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తదితర మంత్రలు కూడా చిరంజీవిని అభినందించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో విశ్వంభర పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించవచ్చని తెలుస్తోంది. అనుష్క, మృణాళ్ ఠాకూర్‌ తదితర హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన విశ్వంభర కాన్సెప్టు పోస్టర్, గ్లింప్స్ వీడియోస్‌ మెగా ఫ్యాన్స్‌ను మంచి కిక్‌ ఇచ్చాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

చిరంజీవితో కేఎస్ భరత్..

 

‘సాయి కుమార్, ఆది సాయి కుమార్..

స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందితో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.