Krithi Shetty: విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ది వారియర్ నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్..

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి శెట్టి (Krithi Shetty).  ఫస్ట్ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో తెగ బిజీ అయిపోయింది

Krithi Shetty: విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ది వారియర్ నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్..
Krithi Shetty

Updated on: Feb 14, 2022 | 12:29 PM

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి శెట్టి (Krithi Shetty).  ఫస్ట్ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో తెగ బిజీ అయిపోయింది. చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది ఇప్పటికే బంగార్రాజు.. శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ది వారియర్ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి.. ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కాంబోలో వస్తున్న లేటేస్ట్ చిత్రం ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళ్ భాషలలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ కృతి శెట్టి విజిల్ మాహాలక్ష్మీ పాత్రలో కనిపించనుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది ది వారియర్ టీం. ఇందులో కృతి శెట్టి జీన్స్, టీ షర్ట్ వేసుకుని కూల్‏గా స్కూటర్ నడుపుతూ కనిపించింది కృతి. ఇందులో ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

Loading...
Unable to load recommendations.
Follow Us