మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన “ఉప్పెన” మూవీలో బేబమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇక మొదటి సినిమా విడుదల కాకముందే కృతి శెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. భారీ ప్రాజెక్ట్స్ కృతి ముందుకు వచ్చాయి. దీంతో అమ్మడు కూడా రెమ్యునరేషన్ భారీగానే పెంచేసిందని టాక్. ఇప్పటికే నానికి జోడిగా.. “శ్యామ్ సింగ రాయ్” సినిమాతోపాటు. సుధీర్ బాబు – డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో రూపొందుతున్న “ఆ అమ్మాయి గురించి చెప్పాలి” అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే క్రమంలో “ఉస్తాద్” రామ్ పోతినేని – డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించనున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
టాలెంటెడ్ హీరో నితిన్… హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రముఖ ఎడిటల్ ఎస్ఆర్ శేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇందులో నితిన్‌కు జోడిగా కృతి నటించబోతున్నట్లుగా టాక్. అలాగే నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ… సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం.