టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి ఇవాళ (జనవరి 20). ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణంరాజును మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. సినిమా రంగానికి రెబల్ స్టార్ అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. అలాగే కృష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు. ఇందులో భాగంగా శనివారం కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఆయన కుటుంబీకులు. హీరో ప్రభాస్, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఆధ్వరంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణం రాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్మతో సహా దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖ వైద్యులు ఈ వైద్య శిబిరానికి హాజరవుతున్నారని శ్యామలాదేవి తెలిపారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్, చికిత్స అందిస్తారన్నారామె. మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను వినియో గించుకోవాలని కృష్ణంరాజు సతీమణి సూచించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న ప్రజలకు వైద్య పరీక్షలతో పాటు మందులు అందజేయనున్నారని శ్యామలా దేవి తెలిపారు. ‘కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, మా బాబు ప్రభాస్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేస్తున్నాం. సుమారు 1000 మంది దాకా ఈ మెడికల్ క్యాంప్‌కు వస్తారని అనుకుంటున్నాం’ అని శ్యామలా దేవి తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు 2022 నవంబర్ 9న కన్నుమూశారు.
Gain valuable expert guidance from professionals on diabetic foot care. 👣
Join us on Jan 20th at Andey Bapanna Jr. College, Mogalthur, for a free medical camp commemorating Shri. Krishnam Raju garu’s birth anniversary.#UKIndiaDFF #UKIndiaDiabeticFootFoundation… pic.twitter.com/zeddYUJPkg
— UK – India DFF (@UKIndiaDFF_) January 18, 2024
Medical camp on diabetic foot care. 👣
Come through and have yourself checked on Jan 20th at Andey Bapanna Jr. College, Mogalthur, for a free medical camp commemorating Shri. Krishnam Raju garu’s birth anniversary.#Prabhas pic.twitter.com/YSbNOUskmw
— Karnataka Rebelstar Prabhas FC® (@KA_Prabhasfc) January 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.