Vijay Deverakonda: రష్మికతో ఫిబ్రవరిలో విజయ్ పెళ్లి ?.. ఎంగేజ్‏మెంట్ పై దేవరకొండ రియాక్షన్..

|

Jan 20, 2024 | 8:44 AM

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. గీతా గోవిందం సినిమాతో విజయ్ ఖాతాలో మరో హిట్ అందించిన డైరెక్టర్ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. అటు రష్మిక సైతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Vijay Deverakonda: రష్మికతో ఫిబ్రవరిలో విజయ్ పెళ్లి ?.. ఎంగేజ్‏మెంట్ పై దేవరకొండ రియాక్షన్..
Vijay Deverakonda, Rashmika
Follow us on

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్, రష్మిక మ్యారేజ్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం, పెళ్లి జరగనుందంటూ ప్రచారం నడుస్తోంది. ఇక ఇటీవలే ఓ నేషనల్ మీడియా విజయ్, రష్మిక నిశ్చితార్థం, పెళ్లి ఫిబ్రవరిలో జరగనుందని వార్తలు రాసుకొచ్చింది. దీంతో మరోసారి వీరిద్దరి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా..కొన్నాళ్లుగా వీరు కలిసి వెకేషన్లకు వెళ్తున్నారంటూ కొన్ని ఫోటోస్ జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తన పెళ్లి వార్తలపై స్పందించారు. ఇటీవల లైఫ్ స్టైల్ ఆసియా అనే మ్యాగజైన్ కోసం విజయ్ ఫోటోషూట్ చేశాడు. ఇక ఆ తర్వాత అదే మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే నెట్టింట చక్కర్లు కొడుతున్న నిశ్చితార్థం గురించి ప్రశ్నించగా.. మరోసారి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు విజయ్. తనకు ప్రతి సంవత్సరం ఒకసారి సోషల్ మీడియాలో పెళ్లి చేస్తున్నారని అన్నాడు.

“నాకు ఫిబ్రవరిలో పెళ్లి, నిశ్చితార్థం జరగడం లేదు.. ప్రతి సంవత్సరం మీడియా నాకు పెళఅలి చేయాలని చూస్తుంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉన్నాను. నన్ను పట్టుకుని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో ? ” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో వీరిద్దరి పెళ్లి, నిశ్చితార్థం అంటూ వస్తోన్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ఈ రూమర్స్ పై ఇప్పటివరకు రష్మిక స్పందించలేదు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. గీతా గోవిందం సినిమాతో విజయ్ ఖాతాలో మరో హిట్ అందించిన డైరెక్టర్ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. అటు రష్మిక సైతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.