KP Chowdary Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు.. సురేఖా వాణి కూతురు కూడా!

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్‌తో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం సృష్టించింది. రెండు రోజుల దర్యాప్తు తర్వాత పోలీసులు..

KP Chowdary Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు.. సురేఖా వాణి కూతురు కూడా!
KP Chowdary Drugs Case

Updated on: Jun 24, 2023 | 9:09 AM

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్‌తో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం సృష్టించింది. రెండు రోజుల దర్యాప్తు తర్వాత పోలీసులు రిమాండ్ రిపోర్టు బయటపెట్టారు. ఈ రిపోర్టులో మొత్తం 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్లు కేపీ చౌదరి దర్యాప్తులో అంగీకరించినట్లు పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి. ఓ బిగ్ బాస్ బ్యూటీతోపాటు ఇతర ఆర్టిస్టులతో వందల సార్లు ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన ఫోన్‌ కాల్స్‌ లిస్ట్‌లో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. ఆ హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి పోలీసులు బయట పెట్టడం లేదు. కేపీ చౌదరి నిర్మాత కాబట్టి సినిమాల విషయమై మాట్లాడాడా, లేదా డ్రగ్స్ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేపీ చౌదరి బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. అతని ఖాతాలో 11 అనుమానస్పద లావాదేవీలను గుర్తించారు.

ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్ది టాలీవుడ్‌లో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. పలువురు ఫేమస్ ఆర్టిస్టులతో దిగిన ఫోటోలు అతని ఫోన్లో లభ్యమయ్యాయి. వారిలో ఓ సీనియర్‌ నటి కూడా ఉంది. ఐతే పోలీసులు ఆమె ఎవరనే విషయాన్ని బయటపెట్టడం లేదు. కేపీ చౌదరి సన్నిహితంగా మెలుగుతున్నట్టుగా ఆ ఫోటోల్లో ఉంది. నటి సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి కేపీ చౌదరి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. డ్రగ్స్‌ కేసులో వీరి పేర్లు కూడా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కస్టడీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేపీ చౌదరి పూర్తిస్థాయిలో దర్యాప్తుకు సహకరించడం లేదు. పోలీసులు తన మీద ఫాల్స్ అలగేషన్స్ వేస్తున్నారని ఆయన అంటున్నారు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లబోతుందో, ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us