Aa Ammayi Gurinchi Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుంచి అందమైన మెలోడీ ప్రోమో

టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. విభిన్న కథలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు యంగ్ హీరోలు..

Aa Ammayi Gurinchi Cheppali: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుంచి అందమైన మెలోడీ ప్రోమో
Aaammayigurinchimeekucheppa

Updated on: Feb 08, 2022 | 5:53 PM

Aa Ammayi Gurinchi Cheppali: టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. విభిన్న కథలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు యంగ్ హీరోలు.. ఈ క్రమంలోనే హీరో సుధీర్ బాబు కూడా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రాణిస్తున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు సుధీర్ బాబు. ఈ క్రమంలోనేమంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు. ఇప్పుడు అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతోరాబోతున్నాడు. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇంద్రగంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి.

ఇప్పుడు అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో మరో సారి ఈ కాంబినేషన్ అలరించడానికి సిద్ధం అవుతుంది. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా తెరకెక్కిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి అందమైన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. కొత్త కొత్తగా అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ అందమైన మెలోడీ ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ

Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..

Ghani Song Launch : వరుణ్ తేజ్ గని సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్

Loading...
Unable to load recommendations.
Follow Us