Tollywood: బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ వీళ్లే.. ఎందుకు వదిలేశారో తెలుసా.. ?

స్టార్ హీరో సినిమాను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్, యష్ వంటి సౌత్ ఇండియన్ హీరోలు హిందీ ఆఫర్లను తిరస్కరించారు. కానీ వీరు రిజెక్ట్ చేసిన సినిమాలు విడుదలయ్యాక మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే వీరు వద్దనుకున్న పాత్రలకు జనాల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇంతకీ సౌత్ నుంచి ఏ హీరో ఏ సినిమా వదులుకున్నారో తెలుసుకుందామా..

Tollywood: బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ వీళ్లే.. ఎందుకు వదిలేశారో తెలుసా.. ?
Yash, Mahesh, Allu Arjun, V
Follow us

|

Updated on: Oct 14, 2024 | 7:58 AM

కొన్నాళ్లుగా సినీరంగుల ప్రపంచంలో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలకు అటు నార్త్‏లోనూ ఊహించని రెస్పాన్స్ వస్తుంది. అలాగే హిందీ చిత్రాల్లో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా మంది సౌత్ ఇండియన్ నటీనటులు బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. కానీ కొందరు స్టార్స్ మాత్రం బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల ఆఫర్స్ రిజెక్ట్ చేశారు. స్టార్ హీరో సినిమాను కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్, యష్ వంటి సౌత్ ఇండియన్ హీరోలు హిందీ ఆఫర్లను తిరస్కరించారు. కానీ వీరు రిజెక్ట్ చేసిన సినిమాలు విడుదలయ్యాక మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాగే వీరు వద్దనుకున్న పాత్రలకు జనాల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇంతకీ సౌత్ నుంచి ఏ హీరో ఏ సినిమా వదులుకున్నారో తెలుసుకుందామా..

* ‘బజరంగీ భాయిజాన్’

2015లో విడుదలైన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నిజానికి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించాల్సింది కాదు. అందులో ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ అని.. కానీ అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. బన్నీ ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.. అప్పుడు సల్మాన్ ఖాన్ చేసి హిట్ అందుకున్నాడు.

* యానిమల్..

గతేడాది విడుదలై విజయం సాధించిన సినిమాల్లో ‘యానిమల్’ ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు అందుకుంది. . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా ఆఫర్ మొదట మహేష్ బాబుకే వెళ్లిందని అంటున్నారు.

* ‘లాల్ కప్తాన్’

2019లో విడుదలైన సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘లాల్‌ కప్తాన్‌’ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆఫర్ మొదట యష్‌కి వెళ్లింది. అప్పుడు కూడా అతనికి బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం లేదు. కాబట్టిఅతను దానిని తిరస్కరించాడు. ఇప్పుడు హిందీలో ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్నాడు.

* ‘లాల్ సింగ్ చద్దా’

అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నాగ చైతన్య నటించాడు. ఈ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చింది. కానీ, అతను దానిని తిరస్కరించాడు. దీంతో చైతూ ఈ చిత్రంలో నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.