AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SpaceX: చరిత్ర సృష్టించిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌.. లాంచ్‌ప్యాడ్‌‌పై బూస్టర్ సేఫ్ ల్యాండ్‌

ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అరుదైన ఘనతను సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే చేర్చి చరిత్ర సృష్టించింది.

SpaceX: చరిత్ర సృష్టించిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌.. లాంచ్‌ప్యాడ్‌‌పై బూస్టర్ సేఫ్ ల్యాండ్‌
Elon Musk's Spacex
Balaraju Goud
|

Updated on: Oct 14, 2024 | 9:20 AM

Share

ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ అరుదైన ఘనతను సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే చేర్చి చరిత్ర సృష్టించింది. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ నుండి నిర్వహించిన ఈ చారిత్రాత్మక టెస్ట్ ఫ్లైట్, పునర్వినియోగ రాకెట్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తాను చాటుకుంది స్పేస్ ఎక్స్.

అపోలో ప్రోగ్రాం సాటర్న్ V కంటే రెట్టింపు శక్తి కలిగిన బూస్టర్ రాకెట్ తెల్లవారుజామున ఆకాశంలోకి నీలిరంగు జ్వాలలకు చిమ్ముతూ నేలపైకి దూసుకువచ్చింది. వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన బూస్టర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే చేర్చిన ఘనతను సాదించింది.

ఆకాశం నుంచి వచ్చిన రాకెట్‌ బూస్టర్‌ను.. లాంచ్‌ప్యాడ్‌ దగ్గర ల్యాండ్‌ చేశారు సైంటిస్టులు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో ప్రయోగాలు నిర్వహిస్తున్న స్పేస్‌ ఎక్స్‌.. మరి సరికొత్త ప్రయోగంతో చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్‌, 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకే వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్‌ కావడం ఇదే తొలిసారి

రాకెట్‌ బూస్టర్లను తిరిగి రప్పించడం స్పేస్‌ ఎక్స్‌కు కొత్తేమీ కాదు. ఉపగ్రహాలు, వ్యోమగాములను కక్ష్యలో ప్రవేశపట్టిన తర్వాత భూమికి తిరిగొచ్చే ఫాల్కన్‌-9 రాకెట్లకు ఉండే బూస్టర్లను తొమ్మిదేళ్లుగా రికవరీ చేస్తూనే ఉంది. అయితే మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ప్లాట్‌ ఫామ్‌లమీద లేదా కాంక్రీట్‌ శ్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భూమి మీద ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌లో ల్యాండ్‌ కావడం మాత్రం ఇదే తొలిసారి.

వీడియో చూడండి…

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!