Manju Warrier: అయ్యా బాబోయ్.. రజినీ సినిమా కోసం మంజు వారియర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది మంజు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మంజు వారియర్ రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మంజు వారియర్ మలయాళీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. దాదాపు 18 ఏళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్న మంజు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. మలయాళంతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది.

Manju Warrier: అయ్యా బాబోయ్.. రజినీ సినిమా కోసం మంజు వారియర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?
Manju Warrier
Follow us

|

Updated on: Oct 13, 2024 | 10:22 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే జైలర్ సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న తలైవా .. ఇప్పుడు వేట్టయాన్ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టైయన్ అక్టోబర్ 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రితికా సింగ్, ఫహద్ ఫాజిల్, రానా దగుపతి, కిషోర్, తుషార విజయన్, రక్షన్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలోని మనసిలియో పాటతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది మంజు వారియర్. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది మంజు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మంజు వారియర్ రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మంజు వారియర్ మలయాళీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. దాదాపు 18 ఏళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్న మంజు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. మలయాళంతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇప్పుడు రజినీ సరసన వెట్టయాన్ సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది మంజు వారియర్. ఈ చిత్రంలో రితికా సింగ్, ఫహద్ ఫాసిల్, రానా దగుపతి, కిషోర్, దుషార విజయన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఫేక్ ఎన్‌కౌంటర్, రొమాంటిక్ కామెడీ ,ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ఎమోషన్ ప్యాక్డ్ మూవీ వెట్టయాన్. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ సినిమాలో రజనీ భార్యగా నటి మంజు వారియర్ నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారనే సమాచారం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వెట్టయాన్ చిత్రంలో నటించినందుకు మంజు వారియర్ రూ.3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 109 కోట్లకు పైగా వసూలు చేసిందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.