క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్  చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే

Phani CH

13 October 2024

భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి పిచ్చెక్కిపోయారు కుర్రకారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ చిన్నది.

మిస్టర్ బచ్చన్ సినిమావిడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే.  కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే ఈ సినిమా డిజాస్టార్ అయిన భాగ్యశ్రీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్.

మొట్టమొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తరువాత బాలీవుడ్ లో యారియాన్ 2 సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

ప్రస్తుతం తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు తన నెక్ట్స్ సినిమాల్లో భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ తో దిగిన ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.