సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

|

Feb 12, 2022 | 11:24 AM

సోషల్ మీడియాలో ఈ మధ్య త్రో బ్యాక్ ఫొటోస్ తెగ హడావిడి చేస్తున్నాయి.తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోట్లోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు నెటిజన్లు.

సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
Pic
Follow us on

సోషల్ మీడియాలో ఈ మధ్య త్రో బ్యాక్ ఫొటోస్ తెగ హడావిడి చేస్తున్నాయి.తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోట్లోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓ బ్యూటీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారి వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అందంతో అభినయంలో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. సైకిలెక్కి సవారీ చేస్తున్న ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. అంత కష్టమేమి కాదేమో కనిపెట్టడం.. మొదటి సినిమానే నేచురల్ స్టార్ నాని సరసన నటించింది ఈ భామ. ఈ అమ్మడు ఎవరంటే..

నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మెహరీన్ కౌర్. తొలి సినిమాతోనే లుక్స్ పరంగా ఆకట్టుకుంది ఈ అందాల భామ. అందం అమాయకత్వం కలబోసిన మెహరీన్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు కుర్ర హీరోలందరి సరసన నటించి ఆకట్టుకుంది మెహరీన్. మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమా మెహరీన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎఫ్ 2 సినిమాలో మెహరీన్ తన నటనతో అలరించింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mehreen