Tollywood: 12 సినిమాలు చేస్తే రెండే హిట్టయ్యాయి.. చివరకు సోషల్ మీడియాలో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు రావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఓ హీరోయిన్. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నప్పటికీ హిట్స్ మాత్రం కొట్టలేకపోతుంది. అంతేకాదు.. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

Tollywood: 12 సినిమాలు చేస్తే రెండే హిట్టయ్యాయి.. చివరకు సోషల్ మీడియాలో..
Actress New

Updated on: Jan 24, 2025 | 6:24 PM

సినీరంగంలో కథానాయికగా రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు ఉన్నా సక్సెస్ కూడా కావాల్సింది. కొంతమంది హీరోయిన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో హిట్స్ అందుకుని స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొందరు మాత్రం తొలి చిత్రానికే హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రావట్లేదు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఇప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేదు. కెరీర్ తొలినాళ్లల్లో వరుస ఆఫర్స్ అందుకుంది.. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే పాయల్ రాజ్ పుత్.

తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి. యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఫస్ట్ మూవీ హిట్టైనా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ సినిమా హిట్ కాలేదు.

తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..