AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Kanagaraj : చేసిందే 5 సినిమాలు.. ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లైఫ్ స్టైల్ చూశారా.. ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్.. యూనివర్సిటిక్ అంటూ అతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. థియేటర్లలో కోట్లు రాబట్టాయి. స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిపోయాయి. అతడు మరెవరో కాదు.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈరోజు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Lokesh Kanagaraj : చేసిందే 5 సినిమాలు.. ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లైఫ్ స్టైల్ చూశారా.. ?
Lokesh Kanganaraj
Rajitha Chanti
|

Updated on: Mar 15, 2025 | 1:25 PM

Share

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో పుట్టి పెరిగారు. అతను 2016లో ‘అవియల్’ అనే సంకలన అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడిగా అతని మొదటి చిత్రం మానగరం. 2017లో థ్రిల్లర్ ఆధారిత చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, మునిష్కాంత్, చార్లీ, శ్రీ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత, ఆయన 2019లో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించారు. పూర్తిగా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ చిత్రం పాటలు లేదా హీరోయిన్లు వంటి ఎటువంటి వాణిజ్య అంశాలు లేకుండా పూర్తిగా యాక్షన్ కథపై దృష్టి పెట్టింది.

ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ విజయాన్ని అందించారు.ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో లోకేష్ పేరు మారుమోగింది. వెంటనే విజయ్ దళపతితో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత విజయ్ దళపతితో కలిసి లియో సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో కూలీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబె మోనికా జాన్, మోనిషా ప్లెస్సీ, జూనియర్ ఎంజిఆర్ నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే, ఆమిర్ ఖాన్ ఇద్దరు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈరోజు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అతని ఆస్తుల విలువ రూ. 100 కోట్ల నుండి 125 కోట్ల మధ్య ఉంటుందని టాక్. చెన్నైలో సొంత ఇల్లు ఉన్న లోకేష్ కనగరాజ్ కు లెక్సస్, బిఎమ్‌డబ్ల్యూ సహా కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..