Rajeev Rayala |
Nov 22, 2022 | 1:19 PM
బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో మెరీనా అబ్రహం ఒకరు. ఊహించని ఎలిమినేషన్ తో ఈ అమ్మడు ఇప్పుడు బయటకు వచ్చేసింది.
11వ వారం మెరీనా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె గత రెండు మూడు వారాల క్రితం వరకు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే హౌస్ లో నిలిచింది.
మెరీనా ఇంట్లో ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోలేదు. అలాగే టాస్కుల విషయంలో కూడా మెరీనా పెద్దగా ప్రభావం చూపించింది లేదు.
హౌస్ లో కూల్ గా ఉండేందుకే ప్రయత్నం చేసింది. దాదాపు అందరూ కూడా ఆమెతో పాజిటివ్ గానే ఉన్నారు. కానీ చివరివారం మాత్రం మిగతా కంటెస్టెంట్ తో సరిగ్గా పోరాడా లేకపోయింది
మొదట తన భర్తతో కలిసి వచ్చిన ఆమె నామినేషన్ లో కూడా ఇద్దరు ఒక జంటగా నిలిచారు. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఇద్దరిని విడగొట్టి ఎవరి ఆట వారిగా అనే క్లారిటీ ఇచ్చేశారు.
ఇక ఇప్పుడు ఎలిమినేట్ అయిన మెరీనా ఒక వారానికి 35 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్న మెరీనా మొత్తంగా 11 వారాలకు 3 లక్షల 80 వేల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.