ఈ హాట్ బ్యూటీ కమెడియన్ పృథ్వీరాజ్‌ కూతురా..! హీరోయిన్‌గా ఏ సినిమాలో నటించిందంటే..

|

Jun 25, 2024 | 4:33 PM

ఖడ్గం సినిమాలోని ఈ డైలాగ్ తో పృథ్వీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత చాలా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఈలలు గోలలు చేస్తారు. ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి.  సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు అందరి హీరోల సినిమాల్లో నటించారాయన.

ఈ హాట్ బ్యూటీ కమెడియన్ పృథ్వీరాజ్‌ కూతురా..! హీరోయిన్‌గా ఏ సినిమాలో నటించిందంటే..
Prudhvi Raj
Follow us on

టాలీవుడ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన నటుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒకరు. ఒకే ఒక్క డైలాగ్ తో బాగా పాపులార్ అయ్యారు పృథ్వీరాజ్‌. ఖడ్గం సినిమాలోని ఈ డైలాగ్ తో పృథ్వీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత చాలా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఈలలు గోలలు చేస్తారు. ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి.  సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు అందరి హీరోల సినిమాల్లో నటించారాయన. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న పృథ్వీరాజ్‌ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : Venu Swamy: వేణు స్వామితో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఎవరో గుర్తుపట్టారా..?

వైఎస్‌ జగన్‌పై అభిమానంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. టీటీడీలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఆతర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు పృథ్వీరాజ్‌. ఇప్పుడు రాజకీయాలతోనూ అటు సినిమాలతోనూ బిజీగా ఉన్న పృథ్వీరాజ్‌ కూతురి గురించి తెలుసా.? ఆయన కూతురు హీరోయిన్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఆమె పేరు శ్రీలు. ఈ చిన్నది హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తొలిసారి కనిపించిన సినిమా ఎదో తెలుసా.? తొలి సినిమాతోనే..

శ్రీలు హీరోయిన్ గా ఓ సినిమా చేసింది. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి స్వయంగా పృథ్వీరాజే దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హారర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలు తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీలుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీలు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటోస్ ..

శ్రీలు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటోస్ ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..