పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవి శంకర్ తనయుడు అద్వాయ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తన స్వీయ దర్శకత్వంలోనే కొడుకును సినీ పరిశ్రమలోకి తీసుకువస్తున్నాడు. ప్రముఖ నటుడు సాయి కుమార్ తమ్ముడే రవిశంకర్. అటు డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు రవిశంకర్ సుపరిచితమే. ఇప్పటివరకు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా, విలన్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు సినీరంగంలోకి హీరోగా తన కొడుకు అద్వాయ్ ను పరిచయం చేయనున్నాడు. ఈ చిత్రానికి రవి శంకర్ దర్శకత్వం వహించనుండగా.. తాజాగా వినాయక చవితి పండగ సందర్భంగా సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ‘సుబ్రహ్మణ్య’ అని ఫిక్స్ చేశారు. సోసియో ఫాంటసి అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో హీరో అద్వాయ్ జుంపాల జుట్టుతో.. గడ్డంతో కనపుడుతున్నాడు. అలాగే వెనక నుంచి దోపిడీ దారులు తరుముకుంటూ వస్తుంటే వారితో పోరాడే యోధుడిగా అద్వాయ్ పై సీన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముంబైలోని రెడ్ చిల్లీస్ స్టూడియోలో జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ప్రముఖ స్టూడియోలలో VFX , CGI పని జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 60% ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.