ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ హనీరోజ్. కానీ ఆ తర్వాత వచ్చిన క్రేజ్ కాపాడుకోలేకపోయింది. నందమూరి నటసింహం వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది ఈ కేరళ కుట్టింది. ఇందులో బాలయ్య భార్యగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో తెలుగులో మరిన్న ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ ఈ మూవీ తర్వాత హనీ ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకలలోనే కనిపించింది. వీరసింహారెడ్డి తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు మాల్స్ ఓపెనింగ్ వీడియోస్, ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. చీరకట్టులోనే అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సినిమాలు చేయకపోయినా అటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇప్పుడు హానీరోజ్ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఇప్పటివరకు సినిమాల్లో కథానాయికగా అలరించిన హానీరోజ్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించనుంది. హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అలాగే తన నిర్మాణ సంస్థ లోగోను కూడా పంచుకుంది. “సినిమా అనేది చాలామందికి ఒక కల. ఒక విజన్.. ఒక వెంచర్. అదొక ఫాంటసీ. జీవిత కోరిక. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో భాగమయ్యాను. ఇప్పుడు దీనిని ఓ వరంలా భావిస్తున్నాను. నా జీవితంలో సినిమా చాలా పెద్ద పాత్ర పోషించింది. కాబట్టి ఇదే పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించడం ఇప్పుడు నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా కొత్త వెంచర్ లోగోను లాంచ్ చేస్తున్నాను. అభిమానుల నుంచి నాకు లభించిన ప్రేమే నేను సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించేలా చేసింది.
మీరు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. HRV ప్రొడక్షన్స్ ద్వారా నా కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాను. టాలెంట్ ఉండి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది వారధిలా నిలబడుతుంది. అద్భుతమైన కథలను సినీ ప్రియులకు చెప్పాలనుకుంటున్నాము” అంటూ రాసుకొచ్చింది.
హనీరోజ్ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.