మొదటి వారమే రసవత్తరంగా సాగుతుంది బిగ్‍బాస్ సీజన్ 8. ఈసారి ఎక్కువగా సీరియల్ బ్యాచ్ ఉన్నప్పటికీ ముగ్గురు చీఫ్స్.. వారికి సైన్యం అంటూ అసలు గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్‍బాస్. ఇక తొలివారం నామినేషన్స్ ఎపిసోడ్లోనే ఒకరిపై మరొకరు ఓ రేంజ్లో వాదించుకున్నారు కంటెస్టెంట్స్. ఇక ఆ తర్వాత టాస్కుల్లోనూ అదే ఫైర్ కొనసాగించారు. కానీ ఇప్పుడు వీకెండ్ దగ్గరపడింది. దీంతో అటు కంటెస్టెంట్స్.. ఇటు అడియన్స్ లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. నిన్న శుక్రవారం. నిన్నటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. అంటే నిన్నటితో తొలి వారం ఓటింగ్ లైన్స్ క్లోజ్ కాగా… తమకు నచ్చిన కంటెస్టెంట్లకు రాత్రి వరకు ఓటింగ్ జరిగాయి. సోమవారం నామినేషన్స్ కంప్లీట్ కావాలి.. కానీ ఈసారి సోమ, మంగళ, బుధవారం నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక నిన్నటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఇక ఇప్పటికే తొలివారం ఎలిమినేషన్ ఎవరనే విషయం గురించి నెట్టింట చర్చ నడుస్తుంది.
అయితే ముందు నుంచి తొలి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే వారిలో ముగ్గురు పేర్లు బలంగా వినిపించాయి. మొదటి వారం విష్ణు ప్రియ, శేఖర్ బాషా, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీశెట్టి నామినేట్ అయ్యారు. అయితే ఇందులో నలుగురి పేర్లు ఎలిమినేషన్ ప్రాసెస్ లో వినిపించాయి. రావడంతోనే సింపథీ స్టార్ అనే ట్యాగ్ అందుకున్న నాగ మణికంఠతోపాటు బెజవాడ బేబక్క, సోనియా ఆకుల పేర్లు ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. అలాగే మొదటి వారం యాంకర్ విష్ణు ప్రియ కూడా ఎలిమినేట్ అవుతుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. తొలివారం ఆరుగురు నామినేషన్లలో ఉండగా.. హౌస్ లో ఉన్నవాళ్లంతా కలిసికట్టుగా మణికంఠను నామినేట్ చేయడంతో అతడికి అడియన్స్ మద్దతు పెరిగిపోయింది. దీంతో అనుహ్యాంగా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. గతం.. కష్టాలు.. ఒంటరితనం అంటూ వచ్చినప్పటి నుంచి తన జీవితం గురించి చెబుతూ హౌస్ లో ఉన్నవాళ్లందరిని ఏడిపించిన మణికంఠ కన్నీళ్లకు జనాలు కనెక్ట్ అయ్యారు. దీంతో అతడికి వరుసపెట్టి ఓట్లు వేసేశారు. దీంతో అతడు టా్ లో ఉండగా.. అనుహ్యాంగా విష్ణుప్రియకు సైతం ఓటింగ్ పెరిగింది.
నాగ మణికంఠ, విష్ణు ప్రియ తర్వాత పృథ్వీ మూడవ స్థానంలో ఉండగా.. శేఖర్ బాషా ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇక నిన్నటి వరకు సోనియా ఆకుల, బేబక్క ఇద్దరికి తక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు సోనియాకు కూడా ఓటింగ్ పెరగడంతో చివరి స్థానంలో బేబక్క నిలిచింది. ఇప్పటివరకు ఆమెకు పది శాతం కూడా ఓట్లు రాలేదని తెలుస్తోంది. దీంతో తొలి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.