ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. రావడంతోనే కంటెస్టెంట్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు హోస్ట్ నాగార్జున. అలాగే అందరికీ స్వీట్లు కూడా పంపించారు. ఆ తర్వాత నిఖిల్ తో మాట్లాడుతూ నీ టీమ్ చిన్నది కదా అని అడగ్గా.. మారుస్తా సర్ అన్నీ మారుస్తా అంటూ నిఖిల్ చెప్పడంతో ఏం మారుస్తావ్ మావా అంటూ నిఖిల్ స్టైల్లోనే మాట్లాడారు నాగ్. అలాగే ప్రతి సీజన్ మాదిరిగా శనివారం వచ్చి వారం మొత్తం జరిగినదానికి జడ్జిమెంట్ ఇవ్వడం ఉండదని కంటెస్టెంట్లకు షాకిచ్చారు నాగ్. ఈసారి హౌస్మేట్స్ జడ్జిమెంట్ తోనే శనివారం స్టార్ట్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎవరెవరిపై కంప్లైంట్స్ ఉన్నాయో చెప్పాలని అడగ్గా.. ముందుగా మణికంఠ గురించి చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. ఒంటరిగా ఉంటున్నాడు.. తనలో తాను మాట్లాడుకుంటున్నాడని శేఖర్ చెప్పగా.. దానికి రీజన్ నామినేషన్లోనే చెప్పేశాడని రివర్స్ అడిగాడు నాగార్జున. కానీ అది కరెక్ట్ అనిపించలేదని చెప్పాడు శేఖర్. ఇక తర్వాత సోనియా కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా హర్టింగ్ గా ఉన్నాయంటూ విష్ణుప్రియ చెప్పింది.
ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య జరిగిన ఫైట్ చూపించారు. నిఖిల్ ముందు నీకు నచ్చలేదు.. కానీ మీకు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందని విష్ణు ప్రియ అడగ్గా నో కామెంట్స్ అంటూ లేచివెళ్లిపోయింది సోనియా. వెళ్తూ వెళ్తూ ఎవరు ఏం అడిగినా అడకపోయినా నేను మాత్రం మీ అడల్డ్ రేటెడ్ కామెడీకి ఒప్పుకోనూ అని చెప్పింది సోనియా. దీంతో మీ మీద బూతు జోకులు వేయలేదు.. మీరిద్దరూ ఏమైనా చేసుకుంటున్నారు .. మీ మధ్య ఏమైనా నడుస్తుంది అనే నేను మాట్లాడలేదు అంటూ విష్ణుప్రియ అడగడంతో స్టాపిట్ అంటూ ఏడ్చేసింది. ఇక పక్కకు వెళ్తు ఆమె ఓ పుణ్యస్త్రీ మేమే తేడానా అంటూ తిట్టుకుంది విష్ణుప్రియ. నీ సైడ్ తప్పు లేకపోయినా సోనియాకు అలా అర్థమైయ్యిందంటూ క్లారిటీ ఇచ్చారు నాగ్. ఇక చివరకు యష్మీ చూపించిన టార్చర్ గురించి సీత కంప్లైయింట్ ఇచ్చింది.
చీఫ్ అన్నప్పుడు పాజిటివ్ గా ఉండాలి. కానీ ఆమె వల్ల హౌస్ వాతావరణం దెబ్బతిన్నది అని సీత చెప్పగా.. ఆట అదే కదా.. ఇంకా మున్ముందు చాలా చూస్తావ్ అంటూ సీతకే రివర్స్ కౌంటరిచ్చారు నాగ్.
బిగ్బాస్ వీకెండ్ ప్రోమో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.