Kamal Haasan : 45 ఏళ్ల క్రితం చెప్పిన కథ.. ఇప్పుడు సినిమాగా వస్తుంది.. కమల్ హాసన్ కామెంట్స్..

డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న లేటేస్ట్ సింగ్ గీతం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన లోకనాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Kamal Haasan : 45 ఏళ్ల క్రితం చెప్పిన కథ.. ఇప్పుడు సినిమాగా వస్తుంది.. కమల్ హాసన్ కామెంట్స్..
Kamal Haasan

Updated on: Jun 08, 2026 | 11:32 AM

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సింగ్‌ గీతం’. ఈ సినిమాను జూన్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొని, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేదికపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. “1957లో ‘మాయాబజార్’ నుంచి ఇప్పటి ‘సింగ్‌ గీతం’ వరకు సింగీతం శ్రీనివాసరావు గారిలో ఏ మార్పు లేదు. సినిమా ఆయనతోనే జీవిస్తోంది. నాకు 20 ఏళ్ల వయసులో ఆయనతో పని చేయడం మొదలుపెట్టాను. ఆయనకు అసిస్టెంట్‌గా, ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశాను. దాదాపు 45 ఏళ్ల క్రితం ముంబైలో ఆయన నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి ‘పుష్పక విమానం’గా వచ్చింది. రెండో కథ గురించి అప్పట్నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదే ఇప్పుడు ‘సింగ్‌ గీతం’గా రాబోతోంది” అని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు చూపిస్తున్న ఉత్సాహం, ఆయనలోని సినిమా పట్ల ప్యాషన్ యువ దర్శకులకు ఆదర్శమని కమల్ అన్నారు. ఆయన పేరులోనే ‘సంగీతం’ ఉందని, కానీ ఇప్పటికైనా అందరూ ఆయనను ‘సింగీతం’ అని పిలవాలని కోరారు. “ఆయన సినిమాను ఎంతటి ప్యాషన్‌తో తీస్తారో, అది తెరపై కనిపిస్తుంది. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండటానికైనా నేను సిద్ధమే” అని తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

“ఈ సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాకు మూడు నెలల ముందే చెప్పి ఉంటే, కచ్చితంగా ఈ చిత్రంలో నటించేవాడిని… ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈ మూవీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించే చిత్రాల్లో ఇది ఒకటి” అని కమల్ హాసన్ అన్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సినిమా అనేది ప్యాషన్‌తో కూడుకున్నదని, ‘సింగ్‌ గీతం’ ఆ ప్యాషన్‌కు ప్రతిరూపమని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Follow Us