
K. Raghavendra Rao: దర్శకేంద్రుడు, శతాధిక దర్శకుడు రాఘవేంద్రరావు చాలాకాలం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. గతంలో శ్రీకాంత్ హీరోగా ఆయన తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ, కామెడీ, సంగీతం, ఎమోషన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇంత కాలానికి ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పెళ్లి సందD’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా ద్వారా శ్రీలీలా హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా నుంచి మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ విడుదుల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా రాఘవేంద్ర రావు ఓ కీలక పాత్రలో నటిస్తోన్నారు. పెళ్లి సందDలో రాఘవేంద్రరావు విశిష్ట అనే పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ సినిమా రాఘవేంద్రరావు రోషన్‌కు తాతగా నటిస్తోన్నారని తెలుస్తోంది. ఈ ప్రోమోలో రాఘవేంద్రరావు సూటు- బూటు వేసుకొని స్టైలిష్‌గా కనిపించరు. ఈ ప్రోమోను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన తర్వాత మన మౌనముని కెమెరా ముందుకు వచ్చారు అంటూ రాజమౌళి రాసుకొచ్చారు. ఈ ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :